గ్రేటర్ లో ఇకపై తాగునీటి సమస్య ఉండదుః కేటీఆర్

భాగ్యనగరాన్ని విశ్వనగరంలో తీర్చేదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేగం పెంచింది. ప్రత్యేకించి మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు అందుకు అనుగుణంగా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించతలపెట్టారు. హైదరాబాద్ జలమండలి , పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు మంత్రికి కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు. కేశవాపురం […]

గ్రేటర్ లో ఇకపై తాగునీటి సమస్య ఉండదుః కేటీఆర్
Follow us

|

Updated on: Oct 06, 2020 | 8:06 PM

భాగ్యనగరాన్ని విశ్వనగరంలో తీర్చేదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేగం పెంచింది. ప్రత్యేకించి మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు అందుకు అనుగుణంగా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించతలపెట్టారు. హైదరాబాద్ జలమండలి , పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు మంత్రికి కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు. కేశవాపురం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన సుమారు 1,490 ఎకరాల భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

కేశవాపురం రిజర్వాయర్ కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అటవీశాఖ అనుమతులకు సంబంధించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 2050 సంవత్సరం వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా నీటి కొరత లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కేశవాపురం రిజర్వాయర్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఇప్పటికే మురికి నీటి శుద్దీకరణలో దేశంలోని అన్ని నగరాల కన్నాఅగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో మురికి నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి జలమండలి అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలను చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 770 ఎం ఎల్ డి ల మురికినీటి శుద్ధీకరణ కొనసాగుతున్నదని, ఇది దేశంలోని అన్ని నగరాల్లో కన్నా అత్యధికమన్న కేటీఆర్… ప్రస్తుతం ఉన్నఎస్టీపీ లకి అదనంగా మరో పన్నెండు వందల ఎంఎల్ డీ, ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.