నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌…

తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

  • Jyothi Gadda
  • Publish Date - 4:08 pm, Thu, 22 October 20

తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. బ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని పార్థీవ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.. అంత్య‌క్రియ‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంత్య‌క్రియ‌ల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. ఆ త‌ర్వాత ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు నాయిని పాడె మోసి నివాళుల‌ర్పించారు. నాయినిని క‌డ‌సారి చూసేందుకు జ‌నం పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.