ఒకవేళ రాజధాని మార్చాలనుకుంటే..టీడీపీ నేతలు ఆపగలరా?

AP Minister Kodali Nani Reaction on Polavaram Reverse Tendering Verdict and AP Capital Issue, ఒకవేళ రాజధాని మార్చాలనుకుంటే..టీడీపీ నేతలు ఆపగలరా?

పోలవరం విషయంలో ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టెండరింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయమని మాత్రమే చెప్పిందన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెచ్చారని కొడాలి పేర్కొన్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని వివరించారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి అడుగులు ముందుకే కాని వెనుకకు పడవని చెప్పారు.

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యల్లో తప్పులేదని నాని వ్యాఖ్యానించారు. పార్టీలో జరుగుతున్న చర్చనే బొత్స వెల్లడించారన్నారు. రాజధానిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ జరగాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. త ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు దోచుకున్నారని.. తాము చేసిన అక్రమాలు బయట పడతాయనే తెదేపా నేతలు గోల చేస్తున్నారని నాని ఆరోపించారు. రాజధానిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే టీడీపీ నేతలు  ఆపగలరా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *