భారీ వర్షాలపై మంత్రి హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారీ వర్షాలపై మంత్రి హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 10:09 AM

ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాలపై ఆరా తీశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు..సర్వసన్నద్దంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లోని హెడ్ క్వార్టర్స్‌ను ఉన్నత అధికారులు వదిలి వెళ్లొద్దని సూచించారు.

వర్షాలతో పాతబడి కూలిన ఇళ్లు, తీవ్రంగా, పాక్షికంగా దెబ్బతిన్న భవనాలను వెంటనే గుర్తించాలని అధికారులను అదేశించారు. అలాగే వారి కుటుంబాలకు..యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సూచించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రేషన్, పరిహారం అందించాలని హరీష్‌రావు ఆదేశించారు.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు