గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు ఆస‌క్తిక‌ర ట్వీట్‌..

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలైన ఓ గర్భిణి శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినిచ్చింది.

గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు ఆస‌క్తిక‌ర ట్వీట్‌..
Follow us

|

Updated on: May 09, 2020 | 9:06 AM

క‌రోనాపై పోరులో  గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల సాహ‌సాన్ని అభినందించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. క‌రోనా సోకినా మ‌హిళ‌కు సుర‌క్షితంగా పురుడు పోసిన వైద్యుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను ‘కనిపించే దైవాలు’గా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఓ మహిళ గాంధీ ఆస్ప‌త్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేప‌థ్యంలో మంత్రి హ‌రీశ్‌రావు ట్విట్ట‌ర్ ద్వారా  స్పందించారు.

‘‘కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ హాస్పిటల్ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్.. హరీశ్ రావు ట్వీట్‌ను రీట్వీట్ చేసి ఈ విధంగా స్పందించారు. ‘‘మీ అభినందనలకు ధన్యవాదములు. మీ శుభాకాంక్షలు మేం మరింత ఉత్సాహంతో పనిచేయడానికి దోహదపడతాయి.’’ అని కామెంట్ చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలైన ఓ గర్భిణి శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినిచ్చింది.  ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణికి గైనకాలజీ విభాగం వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. సదరు మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వారందరూ కూడా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లోనే చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కరోనా సోకిన మహిళకు జన్మించిన బిడ్డకు కరోనా సోకిందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.