గాంధీలో 93ఏళ్ల వృద్దురాలి ఉదంతం..స్పందించిన మంత్రి ఈటల

ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందిస్తుందని మరోమారు రుజువైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుని బయటపడ్డ 93 ఏళ్ల వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ విషయం ప్రభుత్వం ద‌ృష్టికి చేరింది.

గాంధీలో 93ఏళ్ల వృద్దురాలి ఉదంతం..స్పందించిన మంత్రి ఈటల
Follow us

|

Updated on: Jun 24, 2020 | 8:20 PM

ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందిస్తుందని మరోమారు రుజువైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుని బయటపడ్డ 93 ఏళ్ల వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆ వృద్ధురాలు సోమవారం నుండి ఆస్పత్రిలోనే ఉంటోంది. గాంధీ వైద్యులు ఆ వృద్ధ మహిళ కుటుంబ సభ్యులకు పలుమార్లు నచ్చజెప్పినా, వారు అంగీకరించలేదని గాంధీ డాక్టర్లు వెల్లడించారు. అయితే, ఈ విషయం ప్రభుత్వం ద‌ృష్టికి చేరింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించారు.

నెగెటివ్ వచ్చిన 93 ఏళ్ల వ‌ృద్దురాలి పట్ల అలా వ్యవహరించడం హేయమైన చర్యగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాంధీలో ఇటువంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న వారి పట్ల కూడా అవగాహన రాహిత్యంతో బాధితులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇటువంటి సంఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.