కరోనా కట్టడిపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..అప్రమత్తతోనే..

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి..

  • Jyothi Gadda
  • Publish Date - 4:05 pm, Fri, 31 July 20

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం‌ ప్రారంభించారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపోతే కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు తీసుకుంటోందని చెప్పారు. ఖమ్మంలో కరోనా టెస్టింగ్ సెంటర్‌ను ప్రారంభించటం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు వైరస్‌ నిర్ధారణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వైరస్‌కు భయపడాల్సిన పనిలేదని, ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రభుత్వ సెంటర్‌లతో పాటు ఇంటిలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన పెరిగిందన్నారు. దానికి అనుగుణంగానే మందులు, వైద్యులను అందుబాటులో ఉంచి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల తెలిపారు.

దేశంలో పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో కొంతమేర విజయం సాధించామని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకెళ్లాల్సిందేనని చెప్పారు. దేశ వ్యాప్తంగా లాకడౌన్ సడలింపులతోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన మాట వాస్తవమని ఈటల అభిప్రాయపడ్డారు. దేశంలో పలు రాష్ట్రాల్లోకరోనా బీభత్సం సృష్టిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు సాయం మాత్రమే చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More:

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి