రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 12 మంది మృతి

Minibus Bombing Outside Iraq's Karbala Kills 12, Injures 5, రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 12 మంది మృతి

ఇరాక్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్థానికులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 12 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2017 దాడి తర్వాత పౌరులను టార్గెట్‌ చేస్తూ జరిపిన పేలుళ్లలో ఇదే పెద్దది. కర్బాలా ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ చెక్ పాయింట్ మీదుగా ప్రయాణీకులతో వెళ్తున్న మినీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగు వదిలి వెళ్లాడు. అతను బస్సు దిగిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది.

పేలుడు ఉగ్రమూకల కనుసన్నల్లోని స్లీపర్‌ సెల్స్‌ పనిగా భావిస్తున్నారు. ఇరాక్‌లో ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయితే ఈసారి పెద్దమొత్తంలో ప్లాన్‌ చేసి బస్సును పేల్చేశారు. మృతులంతా సాధారణ పౌరులే అని అధికారులు ప్రకటించారు. పేలుడులో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Minibus Bombing Outside Iraq's Karbala Kills 12, Injures 5, రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 12 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *