ఏపీలో క్రీడలకు అధిక ప్రాధాన్యం: మినీస్టేడియం ప్రారంభించిన మంత్రులు

ఒంగోలులో 4 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన మినీస్టేడియం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాసులురెడ్డిలు ప్రారంభించారు. రాష్ట్రంలో 109 ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 36 కేంద్రాలు పూర్తయ్యాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వైయస్‌ఆర్‌ క్రీడా ప్రోత్సాహకాల కింద గత ఏడాది 2 కోట్ల రూపాయలు క్రీడాకారులకు ప్రోత్సాహకాల కింద అందచేశామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన […]

ఏపీలో క్రీడలకు అధిక ప్రాధాన్యం: మినీస్టేడియం ప్రారంభించిన మంత్రులు
Follow us

|

Updated on: Nov 04, 2020 | 1:51 PM

ఒంగోలులో 4 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన మినీస్టేడియం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాసులురెడ్డిలు ప్రారంభించారు. రాష్ట్రంలో 109 ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 36 కేంద్రాలు పూర్తయ్యాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వైయస్‌ఆర్‌ క్రీడా ప్రోత్సాహకాల కింద గత ఏడాది 2 కోట్ల రూపాయలు క్రీడాకారులకు ప్రోత్సాహకాల కింద అందచేశామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందచేశామన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ కల క్రీడాకారులు ఎక్కడున్నా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సియం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా క్రీడలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రీడాకారులతో పాటు క్రీడా సంఘాలను కూడా రాజకీయాలకు అతీతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. స్పోర్ట్స్‌ స్కూళ్ళల్లో తగిన వసతులు, సౌకర్యాలు మెరుగైన రీతిలో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడపలో వైయస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ స్కూలు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సహకాలకు ఎంపికయిందన్నారు. రాష్ట్రంలోని తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించే విధంగా తమ పిల్లలను తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ కోరారు. ఈ సందర్బంగా మహిళలకు కుట్టుమిషన్లను మంత్రులు పంపిణీ చేశారు. అనంతరం క్రీడాప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షటిల్‌ కోర్టులో మంత్రులు, అధికారులు కొంచెంసేపు షటిల్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..