ఇక మాదే ప్రతిపక్షం : అసదుద్దీన్ ఒవైసీ

MIM to claim leader of opposition status in Telangana Assembly, ఇక మాదే ప్రతిపక్షం : అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 మందికి గాను.. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తమ పార్టీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందున.. ప్రధాన ప్రతిపక్షంగా ఎంఐఎంను గుర్తించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దీనిపై స్పీకర్‌ను కలిసి కోరతామని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏడుగు ఎమ్మెల్యేలు వున్నందున రెండో పెద్ద పార్టీగా గుర్తించాలన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10శాతం సీట్లు రావాలి. తెలంగాణలో మొత్తం 119 సీట్లున్నాయి. ఈ లెక్కన కనీసం 12 సీట్లున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ అసెంబ్లీలో ఎంఐఎంకు ఏడుగురు సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. అయితే ఢిల్లీలో 70 ఎమ్మెల్యేలకుగాను.. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఒవైసీ గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *