కాక రేపుతున్న మజ్లీస్ ఎమ్మెల్యే కామెంట్.. తలుచుకుంటే రెండు నెలల్లో సర్కార్‌ను కూల్చేస్తాం…

పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం.. ఓట్ల కోసం అధికార పార్టీనే టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్వవహరించిన మజ్లిస్ నేతలు.. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే..

  • Sanjay Kasula
  • Publish Date - 6:53 pm, Sun, 22 November 20

MLA Mumtaz Ahmed Khan Comments : పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం.. ఓట్ల కోసం అధికార పార్టీనే టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్వవహరించిన మజ్లిస్ నేతలు.. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ హెచ్చరికలకు దిగుతున్నారు.

పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చార్మినార్‌ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు గద్దెనెక్కించడమూ తెలుసని.. దింపడమూ తెలుసంటూ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం ఎంఐఎం పార్టీ ఇంటి గుమస్తా లాంటిదన్నారు. ఈ మధ్యే కళ్లు తెరిచిన చిలకంటూ మంత్రి కేటీఆర్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.