బల్దియాలో హీట్ పెంచుతున్న డైలాగ్ వార్.. బీజేపీ నేతలకు మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్

బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఎం.ఐ.ఎం. అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు. తాను మాట్లాడటం మొదలు పెడితే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి పోటీ హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌ మధ్యే అంటూ కొత్త డైలాంగ్ పేల్చారు‌.

  • Sanjay Kasula
  • Publish Date - 12:04 pm, Fri, 27 November 20

Asaduddin Challenges : బల్దియా దంగల్ హాట్ హాట్‌గా సాగుతోంది. డైలాగ్‌లు డైనమైట్లలా పేలుతున్నాయి. మాటలు తూటాల్లా దిగుతున్నాయి. వింటర్‌లోనూ వేడి పుట్టిస్తున్న డైనమైట్ల లాంటి ఆ డైలాగ్స్‌ను ఒక పార్టీపై మరొక పార్టీ సందించుకుంటోంది. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఎం.ఐ.ఎం. అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు.

తాను మాట్లాడటం మొదలు పెడితే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి పోటీ హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌ మధ్యే అంటూ కొత్త డైలాంగ్ పేల్చారు‌. ఢిల్లీ నుంచి కట్ట కట్టుకుని వచ్చే నేతలు తనను ఏమీ చేయలేరన్నారు. ప్రధాని మోదీని పాతబస్తీలో పర్యటించాలని సవాల్‌ విసిరారు. ఆపద సమయంలో ముస్లింలందరూ ఏకం కావాలని అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చిందన్నారు. తమను హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు… కానీ తమ పార్టీ తరపున చాలా మంది హిందువులకు టికెట్లు ఇచ్చామని అసద్‌ స్పష్టం చేశారు.