Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!

Millionaire beggar dies in Mumbai. Cops take 8 hours to count his coins amounting to Rs 1.77 lakh, యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!

ఆయన ఓ యాచకుడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మరణంచిన తర్వాత తెలిసింది.. ఆయన ఓ లక్షాధికారి అని. ముంబైలో జరిగిన ఈ ఘటన పోలీసులకు షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బిర్భిచంద్‌ అజాద్‌ (62) అనే వృద్ధుడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే శుక్రవారం రాత్రి.. ఓ ట్రైన్ పట్టాలు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టి చనిపోయాడు. గమనించిన స్థానిక రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతని వద్ద ఉన్న సంచిని చూసి షాక్ తిన్నారు. అందులో పెద్ద ఎత్తున చిల్లరతో పాటుగా నగదు, బ్యాంక్ రిసిప్టలు ఉన్నాయి. సంచిలో ఉన్న మొత్తం చిల్లరను లెక్కించడానికి దాదాపు ఎనిమిది గంటలు పట్టినట్లు పోలీసులు తెలిపారు. చిల్లర, నోట్లు కలిసి మొత్తం రూ.1.77 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన రిసీప్ట్‌లను చూసి ఆశ్చర్యపోయారు. వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌ చేసిన డిపాజిట్‌ మొత్తం రూ.8.77లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఆ యాచకుడికి సంబంధించిన పాన్‌ కార్డు, ఆధార్‌కార్డు, సీనియర్‌ సిటిజన్‌ కార్డు కూడా ఉండడం మరో విశేషం. గుర్తింపు కార్డుల ద్వారా మృతుని స్వస్థలం రాజస్థాన్‌ రాష్ట్రం కాగా, ఏళ్ల క్రితం ముంబై వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు మృతుడు ఆజాద్ కుటుంబ సభ్యుల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

Millionaire beggar dies in Mumbai. Cops take 8 hours to count his coins amounting to Rs 1.77 lakh, యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!