మిలియన్ మార్చ్: ముందస్తుగా నేతల అరెస్ట్‌లు..!

అటు తెలంగాణ సర్కార్, ఇటు ఆర్టీసీ కార్మికులు.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆర్టీసీ రగడ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే క్రమంలో జేఏసీ, ఇతర రాజకీయపక్షాలు సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో కనిపిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. అయినా.. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండంతో ముందస్తు […]

మిలియన్ మార్చ్: ముందస్తుగా నేతల అరెస్ట్‌లు..!
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 9:19 AM

అటు తెలంగాణ సర్కార్, ఇటు ఆర్టీసీ కార్మికులు.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆర్టీసీ రగడ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే క్రమంలో జేఏసీ, ఇతర రాజకీయపక్షాలు సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో కనిపిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. అయినా.. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండంతో ముందస్తు అరెస్ట్‌లకు తెరతీశారు పోలీసులు.

అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జేఏసీ కో కన్వీర్‌ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాజాసింగ్‌ను, పొన్నాల లక్ష్మయ్యను హౌస్‌ అరెస్ట్ చేశారు. దీంతో.. అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి, జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా.. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 155 మంది కార్మికుల అరెస్ట్ చేసిన పోలీసులు. వారిని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

అయితే.. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. దీక్షలకు రాకుండా ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక నాయకులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు అశ్వత్థామరెడ్డి.