Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త కార్యక్రమం.. దర్శనానికి వచ్చే చిన్నారులకు పాల పంపిణీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి. దర్శనాలకు వచ్చే పసిబిడ్డలకు పాల పంపిణీ చేపట్టారు.

Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త కార్యక్రమం.. దర్శనానికి వచ్చే చిన్నారులకు పాల పంపిణీ
Follow us

|

Updated on: Jan 08, 2021 | 2:28 PM

Srikalahasti Temple:  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి. దర్శనాలకు వచ్చే పసిబిడ్డలకు పాల పంపిణీ చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమంల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఆలయంలో దేవతా మూర్తులకు అభిషేకించే పాలకు పోను… మిగిలిన పాలు మొత్తాన్ని ఇలా పసిపిల్లలకు అందివ్వాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి తెలిపారు.

దీంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ గోశాల పాలను దర్శనాలకు వచ్చే పసిబిడ్డలకు అందించనున్నారు. స్వామివారి దర్శనాలకు వచ్చే పిల్లలు పాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ప్రతి నిత్యం ఆలయంలో ఈ పాల పంపిణీ కార్యక్రమం అమలవుతుందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి.

Also Read :

Cockfights: కోడి కత్తులు తయారు చేసేవారిపై బైండోవర్ కేసులు.. ఈసారి పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

Covid Strain Cases In India: దేశంలో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు.. అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ