చైనాపై ‘సైనిక వ్యూహం’, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్

లడాఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాటుకు సంబంధించి ఆ దేశంతో సైనిక, దౌత్య స్థాయి చర్చలు విఫలమైన పక్షంలో, ఇండియాకు 'సైనిక వ్యూహం' (మిలిటరీ ఆప్షన్)  ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఉభయ దేశాల..

చైనాపై 'సైనిక వ్యూహం', డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 5:28 PM

లడాఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాటుకు సంబంధించి ఆ దేశంతో సైనిక, దౌత్య స్థాయి చర్చలు విఫలమైన పక్షంలో, ఇండియాకు ‘సైనిక వ్యూహం’ (మిలిటరీ ఆప్షన్)  ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య 5 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఈ సంవత్సరం ఆరంభంలో లడాఖ్ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసినక్యాంప్ తాలూకు ప్రతిష్టంభన ఇంకా పరిష్కారం కాలేదని ఆయన చెప్పారు. చైనా దళాల చొరబాటును ఎదుర్కొనేందుకు మిలిటరీ వ్యూహం ఉందని, అయితే సైనిక, డిప్లొమాటిక్ చర్చలు విఫలమైన పక్షంలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఇది ఎలాంటి వ్యూహమన్నదానిపై వివరించేందుకు ఆయన నిరాకరించారు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా లడాఖ్ పరిస్థితిపై సమీక్షించిన సంగతి తెలిసిందే.