ధోని వెర్సస్ పాంటింగ్.. ఎవరు ది బెస్ట్.?

Dhoni Versus Ponting Who Is The Best Captain, ధోని వెర్సస్ పాంటింగ్.. ఎవరు ది బెస్ట్.?

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో పాటుగా బెస్ట్ కెప్టెన్ అఫ్ అల్ టైం అని చెప్పవచ్చు. అయితే ధోని కంటే ముందుగా ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ ఉంటాడన్నది అక్షర సత్యం. 90వ దశకం నుంచి దాదాపు 2011 వరకు ఆసీస్ జట్టుకు ఘన విజయాలు అందించడమే కాకుండా అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను ఎదురులేని జట్టుగా తీర్చిదిద్దాడు. పాంటింగ్ మాదిరిగానే ధోని కూడా భారత్‌కు అపురూపమైన విజయాలతో పాటుగా నెంబర్ వన్ ర్యాంక్‌కు చేర్చాడు.  వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అని సగటు క్రీడా అభిమానిని అడిగినా.. ఠక్కున ఆన్సర్ చెప్పలేరు. అలాంటిది ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ.. ఈ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. పాంటింగ్ సారధ్యంలో కంగారూల జట్టుకు ఆడిన మైక్ హస్సీ… ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడాడు.

‘ఇది చెప్పడం చాలా కష్టం. అయినా రికీపాంటింగ్‌కే నా ఓటు. వన్డేల్లో ధోనీ సారథ్యంలో నేనెప్పుడూ ఆడలేదు. కాబట్టి పాంటింగ్‌నే ఎంచుకుంటా’ అంటూ మైక్ హస్సీ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. ధోని సారధ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటుగా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అలాగే పాంటింగ్ కెప్టెన్సీలో 2003, 2007లో రెండు వరల్డ్ కప్స్‌ను ఆస్ట్రేలియా అందుకుంది. ఇకపోతే ధోనికి విజయ శాతం 59.52గా నమోదవ్వగా ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ 76.14గా నమోదైంది. కాగా హస్సీ 2011, 2012 సీజన్లలో ధోని సారధ్యంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు. ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *