20 ఏళ్ల తరువాత… వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ చెత్త రికార్డు!

టీమిండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ టెయిలెండర్‌ మైగెల్‌ కమ్మిన్స్‌ చెత్త రికార్డు సృష్టించాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 188/8తో మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ మరో 33 పరుగులు చేసి 222 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమ్మిన్స్‌ 95 నిమిషాలపాటు క్రీజులో ఉండి 45 బంతుల్లో ఒక్క పరుగూ చెయ్యకుండా ఔటయ్యాడు. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌(39)తో కలిసి అతడు అంతసేపు క్రీజులో ఉన్నా ఒక్క పరుగూ చేయకపోవడం విశేషం. టెస్టు చరిత్రలో […]

20 ఏళ్ల తరువాత... వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ చెత్త రికార్డు!
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 6:45 PM

టీమిండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ టెయిలెండర్‌ మైగెల్‌ కమ్మిన్స్‌ చెత్త రికార్డు సృష్టించాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 188/8తో మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ మరో 33 పరుగులు చేసి 222 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమ్మిన్స్‌ 95 నిమిషాలపాటు క్రీజులో ఉండి 45 బంతుల్లో ఒక్క పరుగూ చెయ్యకుండా ఔటయ్యాడు. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌(39)తో కలిసి అతడు అంతసేపు క్రీజులో ఉన్నా ఒక్క పరుగూ చేయకపోవడం విశేషం. టెస్టు చరిత్రలో రెండో చెత్త ఇన్నింగ్స్‌ ఆడిన ఆటగాడిగా క్రికెట్‌ చరిత్ర పుటల్లో రికార్డు సృష్టించాడు. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జీయాఫ్‌ అల్లట్‌ 101 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి డకౌటయ్యాడు. 20 ఏళ్ల తర్వాత కమ్మిన్స్‌ 95 నిమిషాల బ్యాటింగ్‌ చేసి ఆఖరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.