శవాల వెనుక మిస్టరీ..? బర్త్ డే పార్టీలో ఏం జరిగింది..?

ఒకే బావిలో తొమ్మిది శవాలు.. వరంగల్ బావిలో శవాల వెనుక మిస్టరీ ఏంటి..? చంపేశారా…? చనిపోయారా..? బిహార్ ముఠా పనేనా…? లేక లోకల్‌గా స్కెచ్ వేశారా ? వాళ్లంతా వలస కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చి …చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబం. ఇప్పుడా కుటుంబ సభ్యులు… బావిలో శవాలుగా తేలారు. ఎలా చనిపోయారు..? ఎందుకు చనిపోయారు..? హత్యా..? ఆత్మహత్యలా అన్నదానిపై ఇంకా క్లారిటీ […]

శవాల వెనుక మిస్టరీ..? బర్త్ డే పార్టీలో ఏం జరిగింది..?
Follow us

|

Updated on: May 22, 2020 | 1:38 PM

ఒకే బావిలో తొమ్మిది శవాలు.. వరంగల్ బావిలో శవాల వెనుక మిస్టరీ ఏంటి..? చంపేశారా…? చనిపోయారా..? బిహార్ ముఠా పనేనా…? లేక లోకల్‌గా స్కెచ్ వేశారా ?

వాళ్లంతా వలస కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చి …చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబం. ఇప్పుడా కుటుంబ సభ్యులు… బావిలో శవాలుగా తేలారు. ఎలా చనిపోయారు..? ఎందుకు చనిపోయారు..? హత్యా..? ఆత్మహత్యలా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న నాలుగు.. ఇవాళ 5.. కానీ ఈ 9 మృతదేహాల వెనుక సమాధానం దొరకని సందేహాలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి.

వరంగల్ జిల్లా గొర్రెకుంట ఘటనపై పోలీసుల ఆపరేషన్ స్టార్ట్ అయింది. బావిలో నలుగురు వలస కార్మికుల శవాలుగా లభ్యమయ్యాయి. ఇవాళ మరో ఐదు నీళ్లపై తేలాయి. వరుసగా డెడ్‌బాడీస్ బయటపడుతుండడంతో… స్థానికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో ఓ పురాతన బావిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఆరు శవాలు తేలాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన మసూద్ అతని భార్య నిషా 20 సంవత్సరాల కిందట కూలి పని నిమిత్తం వరంగ‌ల్‌కు వచ్చారు. స్థానిక మార్కెట్ పరిసరాల్లో గన్ని సంచులు కుడుతూ జీవనం సాగిస్తోందీ కుటుంబం. వారికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్ డౌన్ సందర్భంగా వారు కంపెనీ వద్ద ఓ గోడౌన్‌లో నివాసం ఉంటున్నారు. మక్సూద్ కొడుకులు కూడా ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. మక్సూద్ కుమార్తెకు మూడేళ్ల బాబు ఉన్నాడు. భర్తతో వివాదం తలెత్తడంతో తల్లిదండ్రులవద్ద ఉంటోంది. వారు నివాసం ఉంటున్న పక్కనే బిహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా నివాసం ఉంటున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం మక్సూద్ మనవడు బర్త్‌డే పార్టీ జరిగింది. ఆ పార్టీలో బిహార్ యువకులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఆ తర్వాత మక్సూద్ కుమార్తె విషయంలో యువకుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి వ్యక్తి గత రెండు రోజులుగా ఇక్కడ కనిపించినట్లుగా పోలీసుల అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరూ…ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వారిపై విష ప్రయోగం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!