మైక్రోసాఫ్ట్ కస్టమర్లకు ఇక “విండోస్” క్లోజ్

మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ వినియోగదారులకు ఆ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు విండోస్ మొబైల్ కస్టమర్లకు ఇస్తున్న టెక్నికల్ సపోర్ట్‌ను.. డిసెంబర్ 10 నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. 2021లోగా.. మైక్రోసాఫ్ట్‌ మొబైల్ ఆఫీస్ యాప్స్‌ను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. మల్టి లింగ్యువల్ టెక్నాలజీ బ్లాగ్ అయిన ఎంగేడ్జెట్ తెలిపిన ప్రకారం.. ఇక విండోస్10 మొబైల్‌ యాప్స్‌కి ఎలాంటి బగ్ ఫిక్సెస్ కానీ.. సెక్యూరిటీ అప్డేట్స్, ఇతర టెక్నికల్ సపోర్ట్ కానీ.. […]

మైక్రోసాఫ్ట్ కస్టమర్లకు ఇక విండోస్ క్లోజ్
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 7:54 PM

మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ వినియోగదారులకు ఆ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు విండోస్ మొబైల్ కస్టమర్లకు ఇస్తున్న టెక్నికల్ సపోర్ట్‌ను.. డిసెంబర్ 10 నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. 2021లోగా.. మైక్రోసాఫ్ట్‌ మొబైల్ ఆఫీస్ యాప్స్‌ను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది.

మల్టి లింగ్యువల్ టెక్నాలజీ బ్లాగ్ అయిన ఎంగేడ్జెట్ తెలిపిన ప్రకారం.. ఇక విండోస్10 మొబైల్‌ యాప్స్‌కి ఎలాంటి బగ్ ఫిక్సెస్ కానీ.. సెక్యూరిటీ అప్డేట్స్, ఇతర టెక్నికల్ సపోర్ట్ కానీ.. 2021 జనవరి 12 నుంచి వినియోగదారుడు అందుకోలేడని తెలిపింది. కాగా, విండోస్ వినియోగదారులు వీలైనంత త్వరగా.. కొత్త మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్‌ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సలహా ఇస్తోంది. ఇప్పటివరకు పనిచేస్తున్న వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్‌నోట్ పనిచేస్తున్నప్పటికీ.. వీటిని ఇక కొత్త డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోలేరని పేర్కొంది.