బడ్జెట్ మొబైల్ రిలీజ్ చేసిన దేశీ కంపెనీ మైక్రోమాక్స్.. అన్ని ఫీచర్లతో అందుబాటు ధరలలో..

దేశీ మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ సంస్థ మరో వేరియంట్ మొబైల్ మైక్రోమాక్స్ ఇన్ 1బీ ని ఈ రోజు మధ్యాహ్నం లాంచ్‌ చేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోన్ బుకింగ్‌ ప్రారంభమైంది.

  • uppula Raju
  • Publish Date - 5:29 pm, Thu, 26 November 20
బడ్జెట్ మొబైల్ రిలీజ్ చేసిన దేశీ కంపెనీ మైక్రోమాక్స్.. అన్ని ఫీచర్లతో అందుబాటు ధరలలో..

దేశీ మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ సంస్థ మరో వేరియంట్ మొబైల్ మైక్రోమాక్స్ ఇన్ 1బీ ని ఈ రోజు మధ్యాహ్నం లాంచ్‌ చేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోన్ బుకింగ్‌ ప్రారంభమైంది. ఈ నెల 24న మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1ను మొదటి సారి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే మైక్రోమాక్స్ ఇన్ 1బీ ఫీచర్స్‌ని తెలుసుకుందాం..

మైక్రోమాక్స్ ఇన్ 1బి 6.52-అంగుళాల హెచ్‌డీ + మినీ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 10వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1బి ధర 2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 6,999, కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్‌లోని కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్.. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా 5 శాతం అదనపు తగ్గింపు పొందగలరు