తక్కువ బడ్జెట్‌లో ‘మైక్రోమాక్స్’ స్మార్ట్‌ఫోన్లు.. నవంబర్ 3న లాంచ్..

'మైక్రోమాక్స్' తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు 'In' సిరీస్ స్మార్ట్‌ఫోన్లను వర్చువల్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు..

తక్కువ బడ్జెట్‌లో 'మైక్రోమాక్స్' స్మార్ట్‌ఫోన్లు.. నవంబర్ 3న లాంచ్..
Follow us

|

Updated on: Oct 23, 2020 | 4:53 PM

Micromax ‘In’ Series Smartphones’: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు మేరకు పరిమితి బడ్జెట్‌లో పూర్తిగా ఇండియాలో తయారైన సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ‘మైక్రోమాక్స్’ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ‘In’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను వర్చువల్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ తెలిపారు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ధర రూ. 7,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుందన్నారు. Helio G35 ప్రాసెసర్, 3GB RAM, 32GB స్టోరేజ్, 6.5-inch HD+ display, 5000mah బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉంటాయని సమాచారం. భారత్-చైనా ఉద్రిక్తతల ముందే ‘In సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ తాయారు చేయడం మొదలుపెట్టిందని.. ఈ స్మార్ట్‌ఫోన్ మోడళ్లన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయబడ్డాయని రాహుల్ శర్మ అన్నారు. అంతేకాదు ఈ ‘In’ సిరీస్ స్మార్ట్ ఫోన్లలకు బ్లోట్‌వేర్, యాడ్స్ ఉండవన్నారు.