కరోనా ఎఫెక్ట్…: రాజధానిలో సంపూర్ణ నైట్ క‌ర్ఫ్యూ..రేపు, ఎల్లుండి మెట్రో బంద్‌

గుజ‌రాత్ రాజధాని అహ్మ‌దాబాద్‌లో సంపూర్ణ క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో రేపు, ఎల్లుండి మెట్రో రైల్ సేవలు నిలిపివేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అహ్మ‌దాబాద్ మెట్రో రైల్ కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి

కరోనా ఎఫెక్ట్...: రాజధానిలో సంపూర్ణ నైట్ క‌ర్ఫ్యూ..రేపు, ఎల్లుండి మెట్రో బంద్‌
Follow us

|

Updated on: Nov 20, 2020 | 10:56 PM

Metro Services to Remain Suspended : దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ముందు వరసలో ఉన్నాయి. అయితే తాజాగా గుజరాత్ రాజధానిలో సంపూర్ణ నైట్ క‌ర్ఫ్యూకు పిలుపునిచ్చాయి.

గుజ‌రాత్ రాజధాని అహ్మ‌దాబాద్‌లో సంపూర్ణ క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో రేపు, ఎల్లుండి మెట్రో రైల్ సేవలు నిలిపివేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అహ్మ‌దాబాద్ మెట్రో రైల్ కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిచండంతో గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఆ రాష్ట్రంలోని ప‌లు న‌గ‌రాల్లో నైట్ క‌ర్ఫ్యూ విధించింది.

అహ్మ‌దాబాద్‌లో మాత్రం న‌వంబ‌ర్ 20 రాత్రి 9 గంట‌ల నుంచి 23 ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు కంప్లీట్ క‌ర్ఫ్యూ విధించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు న‌గ‌రంలో రేపు, ఎల్లుండి మెట్రోరైల్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అహ్మ‌దాబాద్ మెట్రో రైల్ కార్పోరేష‌న్ తెలిపింది.