మెట్రోట్రైన్‌లో మందు బాబు హల్చల్.. చివరికేమైందంటే..?

Metro security officials capture the man who created ruckus in Metro, మెట్రోట్రైన్‌లో మందు బాబు హల్చల్.. చివరికేమైందంటే..?

ఈ నెల 8వ తేదీన.. మెట్రో రైలులో తాగి హల్చల్ చేసిన వ్యక్తిని పట్టుకున్న మెట్రో సెక్యూరిటీ సిబ్బంది. సీలం కనకరాజుగా నిందితుడిని గుర్తించిన సిబ్బంది. అతన్ని పట్టుకున్న మెట్రో సెక్యూరిటీ సిబ్బంది.. ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అత్యంత అధునాతనమైన మెట్రో టెక్నాలజీతో.. సీసీటీవీ ఫుటేజ్‌తో సహా అతని ఫేస్‌ను రిలీజ్‌ చేసిన మెట్రో సిబ్బంది. మెట్రోలో డ్యాన్స్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ హల్చల్ చేసిన సీలం కనకరాజు.

హైదరాబాద్‌‌లో మెట్రో రైలు అందుబాబులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణికులతో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెల 8న సీలం కనకరాజు అనే మందు బాబు మెట్రో రైలులో నానా హంగామా చేశాడు. మద్యం తాగి మహిళల ముందు అనుచితంగా ప్రవర్తించాడు.సెల్ ఫోన్‌లో పాటలు పెట్టుకుని.. చిందులు వేశాడు. మెట్రో రైలు డోర్ వద్ద నిలబడి వింత చేష్టలతో.. తోటి ప్రయాణికులను భయపెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *