వాతావరణ హెచ్చరిక : తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరఠ్వాడ నుండి ఉత్తర తమిళనాడు వరకు మధ్య కర్ణాటక మీదుగా 1.5కిలోమీటర్ల....

వాతావరణ హెచ్చరిక : తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
Follow us

|

Updated on: Jul 20, 2020 | 5:49 PM

తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరఠ్వాడ నుండి ఉత్తర తమిళనాడు వరకు మధ్య కర్ణాటక మీదుగా 1.5కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు వెల్లడించారు.

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరో 24గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా వర్షాలు అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు. అధిక వర్షాలు కురిసే జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని అన్నారు.