నివార్‌తో ఆగడం లేదు…’బురేవి తుఫాన్’..’టకేటి తుఫాన్’.. ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుఫాన్లు…

ఇప్పటికే నివార్ బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇదిలావుంటే మరో అల్పపీడనం లైన్‌లో ఉందన్న సమాచారం అందరిని భయపెడుతోంది.

  • Sanjay Kasula
  • Publish Date - 4:28 pm, Fri, 27 November 20
నివార్‌తో ఆగడం లేదు...'బురేవి తుఫాన్'..'టకేటి తుఫాన్'.. ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుఫాన్లు...

Another Low-Pressure : దక్షణ భారత దేశంను వరుణుడు వణికిస్తున్నాడు. తుఫాన్‌లు పగబడుతున్నాయి. వరస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నివార్ బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇదిలావుంటే మరో అల్పపీడనం లైన్‌లో ఉందన్న సమాచారం అందరిని భయపెడుతోంది.

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

డిసెంబర్‌2న ‘బురేవి తుఫాన్’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7తేదీన దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై  తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.