పోకిరీల వేధింపులతో మెరిట్ విద్యార్థిని మృతి

యూపీ.. బులంద్ షహర్ పరిధిలోని ఓ చిన్న గ్రామానికి చెందిన మెరిట్ విద్యార్థిని సుదీక్షా భాటి పోకిరీల వేధింపుల కారణంగా మృతి చెందింది. తన బంధువుతో కలిసి బైక్ పై వెళ్తున్న ఆమెను కొంతమంది పోకిరీలు ఆమెను తమ ద్విచక్రవాహనాలపై వెంబడిస్తూ..

పోకిరీల వేధింపులతో మెరిట్ విద్యార్థిని మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 1:56 PM

యూపీ.. బులంద్ షహర్ పరిధిలోని ఓ చిన్న గ్రామానికి చెందిన మెరిట్ విద్యార్థిని సుదీక్షా భాటి పోకిరీల వేధింపుల కారణంగా మృతి చెందింది. తన బంధువుతో కలిసి బైక్ పై వెళ్తున్న ఆమెను కొంతమంది పోకిరీలు ఆమెను తమ ద్విచక్రవాహనాలపై వెంబడిస్తూ..ఒక చోట ఆమె బైక్ ని ఢీ కొట్టడంతో  కింద పడిపోయి తీవ్రంగా గాయపడి మరణించింది. అమెరికాలో తన స్టడీస్ కొనసాగించేందుకు ఆమెకు 3.83 కోట్ల స్కాలర్ షిప్ లభించిందనితెలిసింది. గ్రామంలో టీ అమ్ముకుని జీవించే ఈమె తండ్రి తన కూతురు ఇలా అర్ధాంతరంగా మృతి చెందిన విషయం తెలుసుకుని విలపిస్తున్నాడు.

అమెరికాలోని బాక్సన్ కాలేజీలో చదువుకుంటున్న సుదీక్ష.. కరోనా వైరస్ కారణంగా ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమె ఈ  నెల  20 న మళ్ళీ అమెరికాకు వెళ్లాల్సి ఉంది. 2018 లో సీబీ ఎస్ ఈ బోర్డు పరీక్షల్లో టాపర్ అయిన సుదీక్ష మృతి చెందిందని తెలిసి ఆమె గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.