వైట్ హౌస్ లో నేనూ, నా జీవితం, బయోగ్రఫీ రాసే యోచనలో ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఆయన ఆలా ఈ భవనాన్ని వీడగానే ఇలా ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా తన భర్తకు డైవోర్స్ ఇవ్వవచ్చునని వార్తలు, రూమర్లు వస్తున్న వేళ..

  • Umakanth Rao
  • Publish Date - 3:15 pm, Sun, 29 November 20
వైట్ హౌస్ లో నేనూ, నా జీవితం, బయోగ్రఫీ రాసే యోచనలో ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఆయన ఆలా ఈ భవనాన్ని వీడగానే ఇలా ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా తన భర్తకు డైవోర్స్ ఇవ్వవచ్చునని వార్తలు, రూమర్లు వస్తున్న వేళ..మరో కొత్త విషయం వెల్లడైంది. దేశ మొదటి మహిళగా వైట్ హౌస్ లో తాను ఇన్నేళ్ళూ  గడిపిన జీవితంపై ఓ పుస్తకం రాయాలని ఆమె యోచిస్తోందట..సాధారణంగా పబ్లిక్ లోకి రాకుండా ప్రైవేటుగా గడిపే మెలనియా..’వైట్ హౌస్ స్మృతులు’ పేరిట బుక్ రచించే అవకాశం ఉందని ఆమె సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇందుకు ట్రంప్ కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఆమె నిజంగానే ఇలా పుస్తకం రాస్తే అది హాట్ హాట్ కేకులా అమ్ముడుపోయి ఆమెకు భారీగానే సొమ్ము ముడుతుంది.

మెలనియాకు ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ అయిన వోక్ ఆఫ్ అనే సహచరురాలు ‘మెలనియా అండ్ మీ’ పేరిట ఓ పుస్తకం రాసింది. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. వోక్ ఆఫ్ ను అవకాశవాదిగా మెలనియా తిట్టిపోసింది. నా పేరును ఉపయోగించుకుని తను పాపులర్ కావాలనుకుంటోంది అని దుయ్యబట్టింది. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను టేపుల రూపంలో వోక్ విడుదల చేసినప్పుడు కూడా ఆమె ఇలాగే మండిపడింది. ఈ టేపులు సందర్భోచితమైనవి కావని, ఇక వోక్ రాసిన పుస్తకమైతే తన క్యారక్టర్ ని వక్రీకరించేలా ఉందని మెలనియా ట్రంప్ నిప్పులు కక్కింది. యేమైనా ఈమె అసలు పుస్తకం రచిస్తే దానికోసం అమెరికన్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.