చకచకా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు.. అనుకున్న సమయానికి ప్రాజెక్టు కంప్లీట్ చేసే లక్ష్యంతో మెఘా సంస్థ

పోలవరం పనులు రాకెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి. స్పిల్వే బ్రిడ్జి వెయ్యి మీటర్లు పూర్తి కాగా.. సగానికి పైగా గేట్ల అమరిక పూర్తయ్యింది. అనుకున్న సయమానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు విదేశాల నుంచి అవసరమైన యంత్రసామగ్రిని తెప్పిస్తున్నారు.

చకచకా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు.. అనుకున్న సమయానికి ప్రాజెక్టు కంప్లీట్ చేసే లక్ష్యంతో మెఘా సంస్థ
Polavaram Project
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:52 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి లైఫ్‌లైన్‌గా ఉండే పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిపోతున్నాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని లక్ష్యంతో మెఘా సంస్థ వర్క్స్‌ను స్పీడప్‌ చేసింది. ఇప్పటి వరకు జరిగిన పనులు పరిశీలిస్తే… 1128 మీటర్ల స్పిల్వే బ్రిడ్జి పనుల్లో 1000 మీటర్లు పూర్తి చేశారు.

ఇంకా 128 మీటర్లు కంప్లీట్ చేస్తే సరిపోతోంది. స్పిల్వే పిల్లర్లు పై పెట్టాల్సిన 192 గడ్డర్లకు గాను ఇప్పటికే 180 పెట్టారు. ఇంకా 12 పెట్టాల్సి ఉంది. ఈ గడ్డర్ల ఏర్పాటును లాస్ట్‌ ఇయర్‌ జులై 6న స్టార్ట్ చేశారు. స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్‌ కాంక్రీట్ నిర్మాణాన్ని 2020 సెప్లెంబర్‌9న మొదలు పెట్టారు. కేవలం నాలుగున్నర్ర నెలల కాలంలోనే 1కిలోమీటర్ బ్రిడ్జి స్లాబు నిర్మించి రికార్డు సృష్టించారు. వరదలు, కరోనా సమస్యలు వచ్చినా ఈ ప్రోసెస్‌ ఆగలేదు.

స్పిల్‌వేలో ఒక్కో పిల్లరు ఎత్తు 55మీటర్లు. అలాంటివి 35 పిల్లర్లు రెడీ అయ్యాయి. మేఘా సంస్థ పోలవరం పనులు చేపట్టే నాటికి పిల్లర్ల సరాసరి ఎత్తు 23 మీటర్లుగా ఉంది. ఇప్పుడు ఆ సగటు 54.5 మీటర్లకు పెరిగింది. ఇప్పటికి స్పిల్ వే బ్రిడ్జిలో 44 స్లాబ్‌లు పూర్తికాగా… ఇంకా 5 మాత్రమే మిగిలి ఉన్నాయి.

మొత్తం 49 ట్రూనియన్ భీమ్‌లు నిర్మించాల్సి ఉండగా.. ఇందులో 46 కంప్లీట్‌ అయ్యాయి. ఇంకా కేవలం మూడే పూర్తికావలసి ఉంది. స్పిల్ వే బ్రిడ్జిలో 48గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే 24 గేట్లు అమర్చారు. 25వ గేటుకు సంబంధించి స్కిన్ ప్లేట్ అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చుతారు. వీటిని జర్మనీలో తయారు చేస్తారు. ఇప్పటికే పోలవరంలో 46 హైడ్రాలిక్ సిలిండర్లు తెప్పించారు. ప్రస్తుతం 24 సిలిండర్లు జర్మనీ నుంచి వచ్చాయి. ఇంకా 26సిలిండర్లు త్వరలోనే జర్మనీ నుంచి ప్రత్యేకం రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం