Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

చోక్సీ అమ్మినవి తక్కువ గ్రేడ్‌ వజ్రాలు: అమెరికా కోర్టు

, చోక్సీ అమ్మినవి తక్కువ గ్రేడ్‌ వజ్రాలు: అమెరికా కోర్టు

న్యూదిల్లీ: పంజాబ్‌ నేషనల్ బ్యాంకును మోసం చేసి వేల కోట్లు దండుకుని పరారైన మోసగాళ్లలో ఒకరైన మెహుల్‌ చోక్సీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియాలోని గీతాంజలి జెమ్స్ అనుబంధంగా అమెరికాలో వీరు నెలకొల్పిన ‘సామ్యుల్స్ జ్యూవెలర్స్’లో వీరు అమ్మినవి నకిలీ వజ్రాలుగా అక్కడి ఫోరెన్సిక్‌ నివేదికలు తేల్చాయి. వజ్రాల నాణ్యతపై అభియోగాలు రావడంతో వాటిపై విచారణ జరపాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ వజ్రాలను ప్రయోగశాలలో తయారు చేశారని, వాటిని నాణ్యమైనవిగా, సహజమైనవిగా వినియోగదారులను నమ్మించేందుకు నకిలీ ధ్రువపత్రాలను సైతం సృష్టించినట్లు తేల్చారు. ఆ ప్రయోగశాలను ఎవరికీ తెలియకుండా చోక్సీ చాలా రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఇండియాలో పీఎన్‌బీని మోసగించి తీసుకున్న ఎల్‌ఓయూలను అడ్డుపెట్టుకుని సామ్యుల్‌ జ్యూవెలర్స్‌కి సంబంధించినదిగా చూపి ‘శామ్‌ రాయల్టీ అగ్రిమెంట్‌’ పేరుతో దాదాపు రూ. 139 కోట్లను పక్కదారి పట్టించినట్లు సమాచారం. అక్కడ నకిలీ వజ్రాల వ్యాపారం జరుగుతున్నట్లు ఆ సంస్థలో పనిచేసిన ఒక సీనియర్‌ ఉద్యోగి ఒకరు గతంలో బయటపెట్టారు. ‘బ్రాండ్‌పేరుతో నకిలీ వజ్రాలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వాటికి సంబంధించి ఇస్తున్న ధ్రువపత్రాలు కూడా నకిలీవే. అక్కడ గ్రేడ్‌-ఏ గా అమ్ముతున్న వజ్రాలన్నీ నిజానికి గ్రేడ్‌-సీ కిందకు వస్తాయి. వాటి అమ్మకం ధరలో కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ప్రయోగశాలలో వాటిని తయారుచేయడానికి ఖర్చవుతోంద’ని ఆ సంస్థ మాజీ ఎండీ సంతోష్‌ శ్రీవాత్సవ బయటపెట్టారు.