Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

హోటల్ బిల్లుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్..

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఈ భామ ‘అశ్వథ్థామ’ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని నిర్మించింది కూడా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్. అయితే తాను స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్మాతల పే చేయలేదంటూ ఇటీవల మీడియాకు లీకులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Mehreen Pirzada miffed with Ashwathama producer for not clearing hotel bills, హోటల్ బిల్లుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్..

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఈ భామ ‘అశ్వథ్థామ’ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని నిర్మించింది కూడా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్. అయితే తాను స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్మాతల పే చేయలేదంటూ ఇటీవల మీడియాకు లీకులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సినిమా కోసం మెహ్రీన్‌కు రూ. 65 లక్షల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట. అందులో రూ. 55 లక్షలు సినిమాకు ముందే ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మిగతా రూ. 10 లక్షల సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని నిర్మాణ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా సినిమా కంప్లీట్ అయ్యాక ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రమోషన్స్‌కు యగనామం పెట్టిందట హీరోయిన్. దీంతో ప్రొడ్యూసర్స్ హోటల్ కోసం, ఇతరత్రా ఖర్చులు కోసం ఇంత ఖర్చు చేస్తుంటే..ప్రయోషన్స్‌కి రాకపోతే ఎలా అని కాస్త ఫైరయ్యారట. అలా అనగానే అలిగిన మెహ్రీన్ చెప్పా పెట్టకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందట. ఇక చేసేది లేక అప్పటివరకు అయిన బిల్లులను ఐరా క్రియేషన్స్ పే చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ కూడా ధృవీకరించారు. అయితే ముందుగా తనకు బ్యాడ్ నేమ్ రాకూడదన్న నేపథ్యంలో మెహ్రీన్ ఈ తరహా లీకులకు పాల్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్ :

“నా సంక్రాంతి విడుదల ప్రమోషన్లను ముగించిన తరువాత, నేను పంజాబ్‌లోని నా కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాను. చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందు నేను ప్రమోషనల్ వర్క్ చేయడానికి హైదరాబాద్ తిరిగి వచ్చాను. మా తాతగారికి గుండెపోటు రావడం వల్ల నేను హైదరాబాద్ వచ్చేందుకు కొంత సమయం ఆలస్యమైంది. ఈ విషయాన్ని నా సహనటుడు నాగ శౌర్య ఇంటర్వ్యూల సందర్భంగా కూడా ప్రస్తావించారు. తిరిగి వచ్చిన తర్వాత నేను అశ్వథామ కోసం అన్ని ప్రమోషన్లలో పాల్గొన్నాను.  నాకు స్కిన్ అలెర్జీ వచ్చి..ముఖం దద్దుర్లు రావడంతో ఒక  ఒక ఇంటర్వ్యూలో పాల్గొనలేకపోయాను. అందుకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫోటోను నిర్మాతలకు పంపి..క్షమాపణ కోరాను. అయినా కూడా  నిర్మాతలు నా హోటల్ బిల్లును కట్టడానికి నిరాకరించారు. నా సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించలేదు. నేను కోరిన తర్వాత ఆ హోటల్ బిల్లులు పే చేసి…సిబ్బందికి డబ్బులు ఇచ్చారు.  కాని ప్రస్తుతం సర్కులేట్ అవుతోన్న వార్తలు నన్ను చాలా బాధకు గురిచేశాయి. నేను ఇప్పటివరకు  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 14 చిత్రాలలో పనిచేశాను. కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా కోసం వాటన్నింటిని దాటి వచ్చాను. ఇప్పటివరకు పనిచేసిన ఏ సంస్థతో కూడా నాకు ఫైనాన్సియల్ డిఫరెన్సెస్ లేవు. కొన్ని ఆర్టికల్స్‌లో నా హోటల్ బిల్లులు, ఆహారం, లాండ్రీ బిల్లులు ప్రస్తావించం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా, నా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పారితోషికంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది నేరుగా ప్రొడక్షన్ హౌస్‌తో జరుగుతుంది. ప్రతి కాయన్‌కి రెండు వైపులు ఉంటాయి. నాకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని కించపరుస్తున్నప్పుడు..సైలెంట్‌గా ఉండలేను. అశ్వథామ చిత్రంలో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐరా క్రియేషన్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలు సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఇకపై ఈ విషయం గురించి నేను ప్రస్తావించాలనుకోవడం లేదు” అని మెహ్రీన్ సోషల్ మీడియాలో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

Related Tags