మెహబూబా ముఫ్తి నిర్బంధ కాలం మరో మూడు నెలలు పొడిగింపు

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నాయకురాలు మెహబూబా ముప్తి నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. గత ఆగస్టు 5 న ఆమెను ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. ఈ పొడిగింపుతో ఆమె ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నట్టు అవుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అలీ మహమ్మద్ సాగర్, పీడీపీ కి చెందిన సర్తాజ్ మదానీల నిర్బంధ కాలాన్ని కూడా ప్రభుత్వం పొడిగించింది. కాగా” మెహబూబా ముప్తి నిర్బంధ కాలాన్ని పొడిగించడంపై […]

మెహబూబా ముఫ్తి నిర్బంధ కాలం మరో మూడు నెలలు పొడిగింపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 1:23 PM

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నాయకురాలు మెహబూబా ముప్తి నిర్బంధ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. గత ఆగస్టు 5 న ఆమెను ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. ఈ పొడిగింపుతో ఆమె ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నట్టు అవుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అలీ మహమ్మద్ సాగర్, పీడీపీ కి చెందిన సర్తాజ్ మదానీల నిర్బంధ కాలాన్ని కూడా ప్రభుత్వం పొడిగించింది. కాగా” మెహబూబా ముప్తి నిర్బంధ కాలాన్ని పొడిగించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇది క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఆమెను ఏ నేరం కింద అదుపులోకి తీసుకుని ఇంతకాలం దాదాపు జైల్లో పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈయనను సుమారు నెల రోజుల క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది.

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్నికేంద్రం రద్దు చేసినప్పటి నుంచి ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలను కేంద్రం అరెస్టు చేసింది. వీరి ప్రసంగాలు అల్లర్లను రెచ్ఛగొట్టవచ్ఛునని, అందుకే నిర్బంధం విధిస్తున్నామని పేర్కొంది. ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేసినవారి నిర్బంధ కాలాన్ని ఎప్పటికప్పుడు పొడిగించవచ్ఛు.