ఇద్దరు ముఖ్యమంత్రులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తోంది. మంత్రులు, రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి, మేఘాలయ ముఖ్యమంత్రులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇద్దరికి నెగిటివ్ రావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్
Follow us

|

Updated on: Jun 29, 2020 | 6:36 PM

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తోంది. ఏ కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంత్రులు, రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి, మేఘాలయ ముఖ్యమంత్రులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇద్దరికి నెగెటివ్ రావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. మేఘాల‌య ముఖ్య‌మంత్రి కే సంగ్మా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అతనికి రెండోసారి కూడా క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు వెల్ల‌డించారు. సీఎం సంగ్మా ర‌క్త న‌మూనాల‌ను జూన్ 22న సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మరోసారి ఆదివారం కూడా సంగ్మాకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా రెండోసారి నెగెటివే వ‌చ్చిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రికి నెగిటివ్ రావ‌డంతో అధికారులు, అభిమానులు ఉపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పటి వరకు మేఘాల‌య‌లో 50 మంది కరోనా బారినపడ్డాయి. అయితే, ఒకరు మాత్రమే కరోనాతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

అటు, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి కూడా ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు. సీఎంతో సహా సిబ్బంది అందరికీ కూడా క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు అక్క‌డి వైద్యాధికారులు వెల్ల‌డించారు. అయితే సీఎం కార్యాల‌యం వ‌ద్ద ఉండే ఓ గ‌న్ మెన్ తండ్రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో 32 మంది భ‌ద్ర‌తా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారి టెస్ట్ ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది.