రాక్ బ్యాండ్ సాంగ్‌తో సీఎం హల్‌చల్

సీఎం అంటే ఎప్పుడు రాజకీయాలు, ప్రజా సమస్యలతోనే సమయం సరిపోతుంది. సంతకాలు, అనుమతులు, ప్రతిపక్షాల విమర్శలు, పార్టీ మీటింగులు అంటూ క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండాల్సి వస్తుంది. కానీ వీటన్నింటికి తాను భిన్నం అని నిరూపించారు.

రాక్ బ్యాండ్ సాంగ్‌తో సీఎం హల్‌చల్
Follow us

|

Updated on: May 23, 2020 | 4:48 PM

అతడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి..సీఎం అంటే ఎప్పుడు రాజకీయాలు, ప్రజా సమస్యలతోనే సమయం సరిపోతుంది. సంతకాలు, అనుమతులు, ప్రతిపక్షాల విమర్శలు, పార్టీ మీటింగులు అంటూ క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండాల్సి వస్తుంది. కానీ వీటన్నింటికి తాను భిన్నం అని నిరూపించారు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా. తన రూటే సపరేటు అంటూ…తాను రిలాక్స్ అవుతూ.. తన సంగీత నైపుణ్యంతో ప్రజలకు హాయిని పంచారు. ఓ పాటకు గిటార్ వాయిస్తూ ఆయన విడుదల చేసిన 43 సెకన్ల ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవలే అక్కడ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాదోపవాదాలు, నిర్ణయాలు అన్ని అయిపోయాయి. దీంతో కాస్త రిలాక్స్ సమయం దొరకడంతో రొటీన్‌కు భిన్నంగా ఐరన్ మెయిడ్స్ పాటకు గిటార్ వాచించారు సీఎం కాన్రాడ్ సంగ్మా. 1980 నాటి రాక్ బ్యాండ్ ఐరస్ మేయిడెన్ పాడిన వేస్టేడ్ ఇయర్స్ పాటకు అనుగుణంగా దీన్ని వాచియించారు. కాగా సంగ్మా వాయిద్య కళలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. అందుకే చాలా రోజుల తర్వాత ఇలా గిటార్ కళను చూపించారు. ఈ సందర్భంగా వీడియోను ప్రజలతో పంచుకుంటూ.. చాలా రోజులైంది కాబట్టి కాస్త పొరపాట్లు దొర్లి ఉండవచ్చు అంటూ కామెంట్ కూడా పెట్టారు. దీంతో అటు, నెటిజన్లు, అతడి అభిమానులు, పార్టీ శ్రేణులు తమ ముఖ్యమంత్రి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు.