మెగాస్టార్ అందుకే “అల” వైకుంఠపురంలోకి రాలేదట..!

స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అలవైకుంఠపురంలో. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకులముందుకు రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని సోమవారం నగరంలోని యూసుఫ్‌గూడలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా మెగాస్టార్ వస్తారని అనుకున్నారంతా. కానీ చిరు మాత్రం ఈవెంట్‌కు హాజరుకాలేదు. అయితే దీనిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అంతకుముందు రోజు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరు.. తరువాతి రోజు […]

మెగాస్టార్ అందుకే అల వైకుంఠపురంలోకి రాలేదట..!
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 6:55 AM

స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అలవైకుంఠపురంలో. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకులముందుకు రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని సోమవారం నగరంలోని యూసుఫ్‌గూడలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా మెగాస్టార్ వస్తారని అనుకున్నారంతా. కానీ చిరు మాత్రం ఈవెంట్‌కు హాజరుకాలేదు. అయితే దీనిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అంతకుముందు రోజు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరు.. తరువాతి రోజు జరిగిన కార్యక్రమానికి రాకపోవడం ఏంటంటూ.. అది కూడా అల్లు అర్జున్ హీరో చిత్రానికి రాకపోవడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా అల్లువారి కుటుంబానికి చిరు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి.  ఇక ఇదంతా ఇలా ఉంటే.. బన్నీ మాత్రం అలవైకుంఠపురం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా.. చిరుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నాకు చిరంజీవి గారంటే ప్రాణమంటూ.. తాను చనిపోయేంత వరకు చిరు ఫ్యాన్‌నే అంటూ బన్నీ వేదికపై నుంచి తెలిపాడు.