Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ..!!

Megastar Chiranjeevi to meet AP CM Jagan on oct 14, ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ..!!

ప్రస్తుతం సైరా సినిమాతో మంచి జోష్‌ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్‌ వద్ద ‘సైరా’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే సమయంలో.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ కాబోతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం వీరిద్దరి మీటింగ్.. తెలుగు రాష్ట్రాలో చాలా ఆసక్తిగా మారింది. జగన్.. సీఎంగా ఎన్నికైనప్పటి నుంచీ చిరు ఆయన్ని విష్ చేయలేదు. అలాగే.. సైరా సినిమా గురించి కూడా సీఎంను కలిసి, ఆయనకు సైరాను చూపించాలనుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా.. సైరా సినిమా రిలీజ్‌ విషయంలో కూడా స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆయా కారణాల దృష్ట్యా చిరు.. సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా.. చిరంజీవి, జగన్‌ల భేటీ వెనుక కొన్ని ఆసక్తికరమైన రీజన్లు ఉన్నాయనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

కాగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎంతో చిరంజీవి సమావేశమవుతారని తొలుత ప్రచారం చేసినా.. ఏపీ సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా.. అది కుదరలేదు. అందులోనూ.. సైరా సినిమాను సీఎంకు చూపించాలనుకుంటున్నారు మెగాస్టార్. దీంతో.. చిరంజీవితో మీటింగ్‌ను.. ఈ నెల 14కి వాయిదా వేసినట్టు సీఎంవో అధికారులు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని.. జగన్‌ను కలవనున్నారు మెగాస్టార్, రాంచరణ్‌లు.

Related Tags