బాసూ.. ఎప్పటికీ తగ్గదుగా మీ గ్రేసు

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌ హిస్టరీలో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా ఎదిగిన చిరు.. ఇప్పటికీ నంబర్ 1 హీరోగానే కొనసాగుతున్నారు. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. అంతేకాదు భవిష్యత్‌లోనూ చిరు స్థానాన్ని భర్తీ చేసే హీరో రావడం కష్టమన్నది సినీ విశ్లేషకులు అభిప్రాయం. అయితే ఆయన పేరు వింటే ఎన్నో అవార్డులు, రివార్డుల పాటు డ్యాన్స్ […]

బాసూ.. ఎప్పటికీ తగ్గదుగా మీ గ్రేసు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2019 | 3:26 PM

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌ హిస్టరీలో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా ఎదిగిన చిరు.. ఇప్పటికీ నంబర్ 1 హీరోగానే కొనసాగుతున్నారు. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. అంతేకాదు భవిష్యత్‌లోనూ చిరు స్థానాన్ని భర్తీ చేసే హీరో రావడం కష్టమన్నది సినీ విశ్లేషకులు అభిప్రాయం. అయితే ఆయన పేరు వింటే ఎన్నో అవార్డులు, రివార్డుల పాటు డ్యాన్స్ కూడా వినిపిస్తుంది. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన డ్యాన్స్‌లో ఓ స్టైల్, ఓ గ్రేస్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలామంది హీరోలు డ్యాన్స్‌లతో అదరగొడుతున్నా.. చిరు గ్రేస్‌ను మాత్రం వారెవరు మ్యాచ్ చేయలేరన్నది సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం. ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది.

‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఎనభైల నాటి తారలంతా ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుకలు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌కు చెందిన 40మంది అప్పటి టాప్ హీరోహీరోయిన్లు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలన్నీ ఆ మధ్యనే విడుదల కాగా.. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి ‘బంగారు కోడిపెట్ట’ పాటకు డ్యాన్స్ వేశారు. ఆయనతో పాటు ఖుష్బూ, జయప్రదలు కూడా తమ కాలును కదిపారు. 64ఏళ్ల వయస్సులో ఆయన చేసిన ఈ డ్యాన్స్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆ వీడియోలో చిరు డ్యాన్స్‌‌ను చూసిన అభిమానులు ‘‘బాసూ.. నువ్వు సూపర్’’.. ‘‘డ్యాన్స్‌లో నీ గ్రేస్‌ను అందుకునే హీరో ఇంకా పుట్టలేదు మామ’’.. ‘‘వయసు అన్నది ఆయనకు మాత్రమే.. ఆయన డ్యాన్స్‌, గ్రేస్‌కు కాదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇటీవల చిరంజీవి సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆయన అభిమానులు తెగ ఆకట్టుకుంది. ఇక త్వరలో కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నారు చిరంజీవి. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.