మెగాస్టార్ బర్త్‌డే మోషన్ పోస్టర్ అదిరిపోయింది..ఇదిగో
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానులకు పండగ రోజు. రేపటితో 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు చిరు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్ప్లే మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానులకు పండగ రోజు. రేపటితో 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు చిరు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్ప్లే మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 100 మంది సెలబ్రిటీలు దీనిని తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఒకేసారి పోస్ట్ చేయడం విశేషం. ఇక చిరంజీవి పుట్టినరోజు కామన్ డీపీ (డిస్ప్లే పిక్చర్)ని, రామ్ చరణ్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేశారు. చిరంజీవి కెరీర్‌ను ప్రతిబింబించేలా దీన్ని డిజైన్ చేశారు.
ఇందులో చిరు నటించిన బ్లాక్బాస్టర్ విజయాలు సాధించిన చిత్రాల్లోని పాత్రలను ఒక్కో మెట్టుపై ఉంచారు. మెగాస్టార్ టైటిల్లో ‘సైరా: నరసింహారెడ్డి’ రోల్‌ను ఉంచారు. చిరంజీవి కొన్నాళ్లు పాలిటిక్స్‌లోకి వెళ్లి, చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ కాలాన్ని కూడా ఈ డీపీలో చూపించడం విశేషం. ‘ఇంద్ర’-‘ఖైదీ నంబర్ 150’ పాత్రల మధ్యలో కొంత భాగం ఫ్లాట్‌గా రాళ్లు, మొక్కలు ఉన్నట్లు డిజైన్ చేశారు.