Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

చిరు భేటీతో.. జగన్‌కు డబుల్ ధమాకా.. అదేంటంటే..!

Mega Star Chiranjeevi Meets AP CM YS Jagan.. What is Jagan Agenda On Meeting, చిరు భేటీతో.. జగన్‌కు డబుల్ ధమాకా.. అదేంటంటే..!

ఆయనో సినీ హీరో.. ఈయనో రియల్ హీరో.. కట్ చేస్తే.. ఇద్దరు కలిశారు. అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోమవారం ఏపీ సీఎం జగన్, ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలు గడిచింది. అయితే ఇప్పటి వరకు ఆయనను కలవని చిరు.. సడన్‌గా జగన్‌ను కలవడం.. దాదాపు గంటసేపు మీటింగ్ జరగింది. ఇంతకీ ఆ భేటీలో ఏం జరిగింది? ఇది తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీలో నడుస్తున్న చర్చ.

దాదాపు గంటపాటు జరిగిన ఇద్దరి భేటీలో రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రచారం జరుగుతున్నా.. సీఎం జగన్ మాత్రం ఈ భేటీని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరుతో జరిగిన భేటీలో ఆయన తనకు ఆత్మీయుడిలా చిరు అభిమానులకు సంకేతాలు పంపారు. అదే సమయంలో జనసేనాకి చెక్ పెట్టే వ్యూహాలకు కూడా పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిరు తమ్ముడే జనసేనాని కావడం.. మరోవైపు చిరంజీవి సామాజిక వర్గం కాపులను దగ్గరకు చేసుకున్నట్లు సంకేతాలు పంపారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ముందు టీడీపీ.. జనసేనా పార్టీలు ఒక్కటేనంటూ వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. అదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాదు ఎన్నికల తర్వాత కూడా టీడీపీ కనుసన్నులోనే జనసేన ఉందంటూ ప్రచారం కొనసాగించారు. అయితే ఇప్పుడు చిరంజీవితో మీటింగ్‌ ద్వారా జగన్.. జనసేనానికి ఓ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరుకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా.. అటు జనసేనాకు చెక్ పెట్టడమే కాకుండా.. కోస్తాంధ్రాలో బలమైన కాపు సామాజిక వర్గానికి కూడా దగ్గరయ్యే వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి.. జగన్ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ మీటింగ్ ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా.. అటు జనసేనా క్యాడర్ కూడా వైసీపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.