Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

‘మెగా’ సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!

Sankranthi Celebrations at Megastar Family, ‘మెగా’ సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోనూ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా హీరోలందరూ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఇక ఆ ఫొటోను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో సహా యంగ్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్‌దేవ్‌లు ఉన్నారు. వారితో పాటు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ‌కూడా ఫ్యామిలీ సంబరాల్లో పాలు పంచుకున్నారు. అయితే ఈ ఫ్రేమ్‌లో ఈ సారి పవన్, నాగబాబు ఇద్దరూ మిస్ అయ్యారు. ఏదేమైనా మెగా హీరోలందరినీ ఒకేచోట చూసిన అభిమానులు మాత్రం ఆ ఫొటోను షేర్ చేస్తూ.. వావ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.