Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

శ్రీముఖికి మద్దతుగా మెగా ఫ్యాన్స్..?

బిగ్‌బాస్‌ షో బుల్లితెరపై.. ఫుల్‌గా పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్ 3 ముందు సీజన్స్.. రెండూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఏ హడావిడీ లేకుండా.. రెండూ ఎంతో ఆసక్తిగా సాగాయి. కానీ వాటికి భిన్నంగా.. బిగ్‌బాస్-3 ఫుల్‌ కాంట్రవర్సీలతో స్టార్ట్ అయ్యింది. అంతే కాదు ఆ షోలో కూడా.. ఫుల్‌గా కాంట్రవర్సీలు మొదలయ్యాయి.

తొలిరోజు నుంచే బిగ్‌బాస్-3 హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తోంది బిగ్‌బాస్ సీజన్ త్రీ. అయితే.. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలవాలంటే హాస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తయితే.. సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే అవసరం. అవును.. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారానే కంటెస్టెంట్లకు ఓట్లు పడతాయ్. కాగా.. బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తన యాక్టీవ్‌నెస్‌తో షోలో ఫుల్ కామెడీ చేస్తోంది. ప్రస్తుతం అయితే.. ఆమెనే బిగ్‌బాస్ -3 టైటిల్ విన్నర్ అవుతుందనే వార్తలు జోరందుకున్నాయి. అంతే కాదు ఇప్పటికే ఆమె పేరు మీద ఆర్మీలు, సోషల్ మీడియాలో పేజీలు ఊపందుకున్నాయి. ఇప్పుడు శ్రీముఖి గురించి మరో ఆసక్తికరమైన విషయం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. శ్రీముఖికి ఇప్పటికే.. బిగ్‌బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మద్దతు తెలుపుతున్నారని సమాచారం. కాగా.. ఇప్పుుడు ఆమెకు మెగా అభిమానులు కూడా మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది.

‘బిగ్‌బాస్‌ 3’ టైటిల్ కోసం ఎవరికి వారు హోరాహోరీగా హౌస్‌లో పోటీ పడుతున్నారు. అయితే.. వారందరిలో శ్రీముఖికి ఓ స్పెషల్‌ అప్పీరన్స్ ఉంది. ఇప్పటికే ఆమెకి మద్దతుగా ఫ్యాన్స్.. పేజీలు, ఆర్మీలు తయారయ్యాయి. అయితే.. శ్రీముఖి ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి.. సైరా సినిమా హాళ్లల్లో యాడ్స్ ప్రకటిస్తున్నారట.. ఈ యాడ్స్‌తోనే అర్థమవుతోంది.. ఆమెకి ఎంత ఫాలోయింగ్ ఉందో..! అయితే.. మరో విషయం ఏంటే.. నిన్నటి బిగ్‌బాస్‌ హౌస్‌లో.. బిగ్ బాస్‌ హౌస్‌లో స్టార్స్ ఎవరు..? అనే టాస్క్ ఇచ్చాడు. అందరూ.. శ్రీముఖీకి స్టార్స్‌ వస్తాయోమో అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా.. శివజ్యోతికి, వరుణ్ సందేశ్‌కి రెండు రెండు స్టార్స్ వచ్చాయి. దీంతో.. ఫ్యాన్స్ కాస్త డీలా పడిపోయారు. దీని బట్టి చూస్తే.. శ్రీముఖీ.. బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అవడం కాస్త కష్టమే అనిపిస్తోంది. చూడాలి మరి ఇంకా నాలుగు వారాలే ఉన్నాయి. కాగా.. ఈ వారం నామినేషన్‌లో వరుణ్, మహేష్, రాహుల్ సప్లిగంజ్‌లు ఉన్నారు.