మెగా డాటర్ నిహారిక పెళ్లికార్డు వచ్చేసిందోయ్..11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు..

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగడానికి సర్వం సన్నద్ధమైంది.

  • uppula Raju
  • Publish Date - 11:58 pm, Tue, 1 December 20
మెగా డాటర్ నిహారిక పెళ్లికార్డు వచ్చేసిందోయ్..11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు..

niharika wedding: మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగడానికి సర్వం సన్నద్ధమైంది. ఇన్ని రోజులు ఫ్రెండ్స్‌‌తో బ్యాచిలర్ పార్టీలు ఎంజాయ్ చేసిన నిహారిక ఇక పెళ్లికూతురుగా ముస్తాబుకానుంది.తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు రిలీజైంది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి మిధున లగ్నంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలోని ఉదయ్‌పూర్ విలాస్‌లో ఈ పెళ్లి మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్లనుంది.

కాగా జొన్నలగడ్డ చైతన్య గుంటూరుకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్‌ కొడుకు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ పెళ్లి తంతు కోసం నిహారిక, వరుణ్‌తేజ ముందస్తుగానే రాజస్థాన్ వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం రిసెప్షన్ 11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె‌గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక విజయవంతమైన సినిమాలలో నటించి తనదైన గుర్తింపును సంపాదించుకుంది. నాగశౌర్యతో కలిసి ఒక మనసు, రాహుల్ విజయ్‌తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో కలిసి ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రన్ వంటి సినిమాల్లో నటించారు. చిరంజీవి టైటిల్ పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డిలోనూ నిహారిక ఓ చిన్న పాత్రలో నటించారు. ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఈ వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇటీవల పెళ్లి నిశ్చయం కావడంతో అన్నిటికి పుల్‌స్టాప్ పెట్టింది ఈ అమ్మడు.