‘ నాకు తోడు కావాలి ‘ అంటున్న ఈ కోతి ఆశ తీరేనా ?

అచ్ఛు మనిషి ముఖాన్ని పోలిన కోతి అది ! చేష్టలు కూడా దాదాపు అలాగే ఉంటాయి. మనిషి లాగే ‘ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ‘ తో కూడిన అరుదైన, విచిత్రమైన ఈ వానరం చైనాలోని తియాంజిన్ జూకు వెళ్తే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ‘ విరహ వేదన ‘ అనుభవిస్తోంది. 19 ఏళ్ళ ఈ వానరానికి ఇప్పటివరకు సరైన జోడీ దొరకలేదట.. ‘ బ్యాచిలర్ ‘ గా ఉన్న దీని ముఖంలోని ‘ నిరాశా భావాలు […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:38 pm, Wed, 20 November 19

అచ్ఛు మనిషి ముఖాన్ని పోలిన కోతి అది ! చేష్టలు కూడా దాదాపు అలాగే ఉంటాయి. మనిషి లాగే ‘ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ‘ తో కూడిన అరుదైన, విచిత్రమైన ఈ వానరం చైనాలోని తియాంజిన్ జూకు వెళ్తే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ‘ విరహ వేదన ‘ అనుభవిస్తోంది. 19 ఏళ్ళ ఈ వానరానికి ఇప్పటివరకు సరైన జోడీ దొరకలేదట.. ‘ బ్యాచిలర్ ‘ గా ఉన్న దీని ముఖంలోని ‘ నిరాశా భావాలు ‘ స్పష్టంగా కనిపిస్తున్నాయని విజిటర్లు బోలెడంత జాలిగా అనుకుంటున్నారు. జూలో దీనికి తోడుగా మరో వానరం ఉన్నప్పటికీ అది మామూలు జాతికి చెందినది. సింగిల్ గా ఉన్నఈ వింత కోతి ఇంటర్నెట్ సెన్సేషన్ అవుతోంది. ఈ మగ వానరం కోసం గతంలో ఇలాంటివే రెండు వానరాలను తెచ్చినా అవి మరణించాయట. బురదతో ఆడుకోవడం, కొబ్బరి కాయలను పగులగొట్టడం అంటే దీనికి సరదా అంటున్నాడు జూ నిర్వాహకుడు.