చెవితోనే ఊదేస్తాడు..!

మీరు బెలూన్లు ఎలా ఊదుతారు..నోటితోనే కదా..? లేదంటే మరి కొంతమంది పంపుతో గాలి నింపుతారు. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం వెరీ స్పెషల్‌ అతడు చాలా వెరైటీగా బెలూన్లనూ గాలితో నింపేస్తూ..అందర్ని వావ్‌ అనిపిస్తున్నాడు. సాధారణంగా బెలూన్లు ఎవరైనా నోటితో ఊదుతారు లేదంటే పంపుతో గాలి నింపుతారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం వింతగా చెవితో బెలూన్లు ఊదేస్తూ జాతీయ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అదేంటి చెవితో బెలూన్లూ ఉదటం ఏంటని […]

చెవితోనే ఊదేస్తాడు..!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 12:36 PM

మీరు బెలూన్లు ఎలా ఊదుతారు..నోటితోనే కదా..? లేదంటే మరి కొంతమంది పంపుతో గాలి నింపుతారు. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం వెరీ స్పెషల్‌ అతడు చాలా వెరైటీగా బెలూన్లనూ గాలితో నింపేస్తూ..అందర్ని వావ్‌ అనిపిస్తున్నాడు.

సాధారణంగా బెలూన్లు ఎవరైనా నోటితో ఊదుతారు లేదంటే పంపుతో గాలి నింపుతారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం వింతగా చెవితో బెలూన్లు ఊదేస్తూ జాతీయ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అదేంటి చెవితో బెలూన్లూ ఉదటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం. ఈ యువకుడి పేరు ఫకీర్ పాషా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బీసీ కాలనీ చెందిన అబ్దుల్‌ – నబాన్‌బీ దంపతుల కుమారుడు పాషా పదో తరగతి వరకు చదివాడు.. పదిహేనేళ్లుగా చెవితో బెలూన్లు ఊదుతూ అందర్ని అబ్బురపరుస్తూ బెలూన్ పాషాగా గుర్తింపు పొందాడు. పాషా టాలెంట్ చూసి అనేక జాతీయ ఛానళ్లు టాలెంట్ షోకు ఆహ్వానించాయి. ప్రతి షోలోనూ తన టాలెంట్ ప్రదర్శిస్తూ వస్తున్నాడు. 70 సెంటి మీటర్ల పొడవైన బెలూన్ ను మూడు నిమిషాల్లో చెవితో ఊదటం పాషా స్పెషల్‌.

చెవితో బెలూన్లను ఊదేయండం ..పాషాకు 15 ఏళ్ల క్రితమే అలవాటైంది. ఓ రోజు చెరువులో ఈతకు వెళ్లిన సమయంలో పాషా చెవుల్లోకి నీళ్లు పోయాయి. ముక్కును గట్టిగా పట్టుకుని గాలి పీల్చడంతో చెవిలోని నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో చెవులతో గాలిని బయటకు పంపడం సాధనం చేసి అదే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. రియాల్టీ షోల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చిన పాషాకు 2017లో పంజాబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనిక్ వరల్డ్ రికార్డు లిమిటెడ్ చోటు దక్కింది. మూడు నిమిషాల్లో 70 సెంటిమీటర్ల పొడవు బెలూన్ ఊదినందుకు యూనిక్యూ ప్రపంచ రికార్డులో స్థానం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం పాషాను ఉత్తమ కళాకారునిగా గుర్తించి అవార్డు అంద చేసింది.

పాషా అంతర్జాతీయ స్థాయి షోలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుతున్నా పాల్గొనేందుకు పేదరికం అడ్డంకిగా నిలుస్తుందని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహిస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించగలడని చెబుతున్నారు. మట్టిలో పుట్టి మాణిక్యంలా ఎదిగిన ఫకీర్ పాషా ఆశయం నెరవేరాలని.. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కల్పించాలని అంతా కోరుకుంటున్నారు.  గిన్నిస్ బుక్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నపాషా కలసాకారం కావాలని మనమూ కోరుకుందాం..

Ballon Blows with Ear2

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం