మరుగుదొడ్డి కోసం కొత్త కోడలు ఏం చేసిందో తెలుసా?

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని కేంద్రం ప్రారంభించిన పథకం.. స్వచ్ఛ అభియాన్ ఎలా అమలవుతుందో తెలిపే సంఘటన ఇది. అత్త వారింట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో మరో కొత్త కోడలు.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. భింద్ జిల్లాలోని ఫూవ్ గ్రామానికి చెందిన జ్యోతి పటేల్( 25) అనే యువతికి .. మొహగాం గ్రామానికి చెందిన వివేక్ పంకజ్ అనే యువకుడితో వివాహమైంది. ఈక్రమంలో పెళ్లి తర్వాత జ్యోతి అత్తవారింటికి వెళ్లింది. అయితే […]

మరుగుదొడ్డి కోసం   కొత్త కోడలు ఏం చేసిందో తెలుసా?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 4:30 PM

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని కేంద్రం ప్రారంభించిన పథకం.. స్వచ్ఛ అభియాన్ ఎలా అమలవుతుందో తెలిపే సంఘటన ఇది. అత్త వారింట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో మరో కొత్త కోడలు.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ భింద్ జిల్లాలో చోటుచేసుకుంది.

భింద్ జిల్లాలోని ఫూవ్ గ్రామానికి చెందిన జ్యోతి పటేల్( 25) అనే యువతికి .. మొహగాం గ్రామానికి చెందిన వివేక్ పంకజ్ అనే యువకుడితో వివాహమైంది. ఈక్రమంలో పెళ్లి తర్వాత జ్యోతి అత్తవారింటికి వెళ్లింది. అయితే అక్కడ మరుగుదొడ్డి లేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ ఘటన ఆమెను కృంగ దీసింది. పెళ్లయిన మూడు రోజులకే ఉన్నపాటుగా అక్కడినుంచి పుట్టింటికి పయనమైంది. ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్లిన తనకు ..అక్కడ అవమానాన్ని ఎదురైందని, అందుకే తాను పుట్టింటికి వచ్చినట్టు తెలిపింది. అక్కడ మరుగుదొడ్డి నిర్మిస్తేనే తాను అక్కడికి వెళ్లానంటూ పట్టుబట్టింది. ఒకవేళ అలా చేయకపోతే విడాకులు సైతం తీసుకోడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ జ్యోతి తెలిపింది. దీంతో ఆమె బాధను అర్ధం చేసుకున్న భర్త, అత్తమామలు.. వెంటనే మరుగుదొడ్డి కట్టించాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ కార్యక్రమంపై పెద్ద పెద్ద ప్రకటనలు, సినీతారలతో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇప్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మార్పు లేదనడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2015లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీమాపటేల్‌కు 2012లో వివాహం జరిగింది.ఆమె అనేక పర్యాయాలు మరుగుదొడ్డి నిర్మించాలని భర్తను అడిగింది. అయినా మోహన్‌ పటేల్‌ పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక అత్తవారింటి నుంచి వెళ్లిపోయింది. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సభ్యుడు గైక్వాడ్‌ సూచన మేరకు సీమాపటేల్‌ భర్త మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అంతకు ముందు బేతుల్‌ జిల్లాలోని చిచౌలి గ్రామానికి చెందిన అనిత నర్రే అనే గిరిజన మహిళ మరుగుదొడ్డి లేనందుకు అత్తవారింటిని విడిచి వెళ్లిపోయింది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్