Breaking News
  • ఆల్ టైమ్ రికార్డ్సు స`ష్టిస్తున్న గోల్డ్ , సిల్వర్ . 10 గ్రాముల బంగారం రూ 58,330 . కేజీ వెండి రూ 78,300. ఈ వారంలోనే మూడు సార్లు పెరిగిన బంగారం ధర . ప్రతిసారీ 8వందల నుంచి వేయి పెరిగిన గోల్డు. 65 వేలకు చేరుకుంటుందంటున్న మార్కెట్ అంచనాలు.
  • ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్.. పిడుగురాళ్ల మండలం చెందిన వందనపు నాగారాజు ఈ నెల 2వ తారీఖున క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ ముంబైలో కేసు నమోదు. ఐపీ అడ్రస్ పిడుగురాళ్ల గా గుర్తింపు. పోస్ట్ పెట్టిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.
  • టీవీ9 తో ఎ పి జైళ్ల శాఖ ఐ జి జయవర్ధన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా టెస్టులు చేయిస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 420 మంది ఖైదీలకు, 60 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఒక్కరోజే రాజమండ్రి సెంట్రల్ జైలు లో 245 మందికి పాజిటివ్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశాం. పాజిటివ్ వచ్చినవాళ్ళల్లో ఎక్కువశాతం మైల్డ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లకు అప్రమత్తత చేశాం. ఐసోలేషన్ సెంటర్ నుంచి ఖైదీల పారిపోవడానికి ప్రయత్నిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఖైదీలకు నాణ్యమైన ఆహారాన్ని వైద్య సౌకర్యాన్ని అందిస్తూ డాక్టర్ల పర్యవేక్షణ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఖైదీల వివరాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నాము. ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
  • అనంతపురం కన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ . భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్ . అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE. ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు.
  • తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం. కోయిఅంబత్తూర్ లోని ఆనకట్ట రహదారిలో చెట్టుని డీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న యువకులలో నలుగురు మృతి , ఒకరి పరిస్థితి విషమం . కారు అతివేగం గా నడపడం ప్రమాదానికి కారణం . ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.
  • దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87శాతం, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతం. మరణాల రేటు దేశంలో 2.07శాతం, ఏపీలో 0.89శాతం. కర్ణాటకలో 1.85శాతం, కర్ణాటకలో 1.85శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52శాతం. ప్రతి పదిలక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు.
  • ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం . గత నెల 10 తేదీన సచివాలయంలో మురళీ మోహన్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ. కార్మిక శాఖ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగం. అరెస్టైన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తోన్న మురళీ మోహన్.
  • భూముల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సందడి . భుాముల విలువ పె౦పు అమలులోకి వస్తే భార౦ పడుతుందని ము౦దుగానే రిజిస్ట్రేషన్ లు వెలుతోన్న జిల్లా వాసులు.

అమానుషం.. మెడికల్‌ టీమ్‌పై దగ్గుతూ ‘హాట్‌స్పాట్’‌ ప్రజల దాడి

కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సిబ్బంది కష్టపడుతుంటే.. వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు.
Mob attack on Medical team, అమానుషం.. మెడికల్‌ టీమ్‌పై దగ్గుతూ ‘హాట్‌స్పాట్’‌ ప్రజల దాడి

కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సిబ్బంది కష్టపడుతుంటే.. వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. వైద్య సిబ్బందిపై దాడి చేయడం, అసభ్యంగా మాట్లాడటం వంటి పనులను చేస్తున్నారు. తాజాగా కరోనా శాంపిల్స్ కోసం వెళ్లిన మెడికల్ టీమ్‌పై హాట్‌ స్పాట్ ప్రజలు దాడి చేశారు. మాస్క్‌లు లేకుండా వచ్చి వారి మీద దగ్గారు. పరుషపదజాలంతో దూషించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేసులు ఎక్కువగా ఉండటంతో తిరువనంతపురంలోని పూన్తురా గ్రామాన్ని హాట్‌స్పాట్‌గా మార్చారు అధికారులు.

ఈ క్రమంలో ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు శుక్రవారం డాక్టర్ ద్యుతీ హరిప్రసాద్‌ నేతృత్వంలో ఓ మెడికల్ టీమ్ అక్కడకు వెళ్లింది. ఆ విషయం తెలిసిన అక్కడి ప్రజలు(60 నుంచి 70 మంది) గుంపుగా వారి వైపు వెళ్లారు. మాస్క్‌లు లేకుండా సామాజిక దూరం పాటించకుండా వారు మెడికల్ టీమ్‌పై దాడి చేశారు. కారు అద్దాలను కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. అనుకోని పరిస్థితుల్లో డ్రైవర్‌ కారు విండోను ఓపెన్‌ చేయగా.. తలను లోపలికి పెట్టిన ఓ వ్యక్తి దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది అని అన్నాడని ద్యుతీ వెల్లడించారు.

వైరస్‌పై, కేసుల నంబర్లపై తాము తప్పుడు లెక్కలు చెబుతున్నామని, తమ లెక్కల వలనే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా మార్చారని, దీంతో ఉపాదిని కోల్పోతున్నామని వారు అంటున్నారని ద్యుతీ తెలిపారు. ఇక వారి దాడితో తమ టీమ్‌లోని ఒక నర్సు ఏడ్చారని.. ఆ తరువాత వారిని ఎంతగానో ప్రార్థిస్తే అక్కడి నుంచి తమను పంపారని ద్యుతీ వివరించారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్‌ టీమ్‌ని కరోనా పరీక్షల నిమిత్తం క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రి కెకె శైలజ తెలిపారు. మూడు నెలలుగా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న అక్కడి ప్రజలు అసహనానికి గురైనట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Tags