మీడియా ఇక ఇక్కడ ఉండదు, మేమే ఉంటాం, హత్రాస్ కలెక్టర్ బెదిరింపు

హత్రాస్ లో ఇరవైఏళ్ళ యువతి హత్యాచారానికి గురైన ఉదంతంలో ఆమె తండ్రిని ఉద్దేశించి ఈ జిల్లా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (జిల్లా కలెక్టర్) బెదిరిస్తూ మాట్లాడిన వైనం వీడియోకెక్కింది. ప్రవీణ్ కుమార్ లక్సర్ అనే ఈయన, సగం మంది మీడియావారు..

  • Umakanth Rao
  • Publish Date - 9:17 pm, Thu, 1 October 20

హత్రాస్ లో ఇరవైఏళ్ళ యువతి హత్యాచారానికి గురైన ఉదంతంలో ఆమె తండ్రిని ఉద్దేశించి ఈ జిల్లా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (జిల్లా కలెక్టర్) బెదిరిస్తూ మాట్లాడిన వైనం వీడియోకెక్కింది. ప్రవీణ్ కుమార్ లక్సర్ అనే ఈయన, సగం మంది మీడియావారు ఇవాళ ఇక్కడ ఉన్నారని, మిగతా సగం మంది రేపు వెళ్ళిపోతారని, కానీ ఇక్కడ ఉండేది మేమేనని బెదిరించడం విశేషం. నీ ప్రకటనను మార్చుకుంటావో లేదో నీ ఇష్టం అని ఆయన ఆ పేద తండ్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంటే బహుశా తన కుమార్తెకు జరిగిన ఘోరంపై పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ ఆ తండ్రి విమర్శించి ఉండవచ్చునని భావిస్తున్నారు. అందుకే ఆగ్రహంతో ప్రవీణ్ కుమార్ ఆయనను ఇలా బెదిరించి ఉండవచ్చు నంటున్నారు. ఆయన ఆగ్రహంతో ఆ తండ్రి బిత్తరపోయాడు.