బీహార్‌, దుబ్బాక ఎన్నికల తరహాలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు..నామినేషన్‌ వేసే సమయంలో ఇది తప్పనిసరి

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సుప్రీం సూచనల మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. బీహార్‌, దుబ్బాక ఎన్నికల్లో మాదిరిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ప్రతి ఒక్కరూ విధిగా..

బీహార్‌, దుబ్బాక ఎన్నికల తరహాలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు..నామినేషన్‌ వేసే సమయంలో ఇది తప్పనిసరి
Follow us

|

Updated on: Nov 18, 2020 | 4:58 PM

GHMC Elections : కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సుప్రీం సూచనల మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. బీహార్‌, దుబ్బాక ఎన్నికల్లో మాదిరిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు, క్యూలైన్లలో సోషల్ డిస్టెన్స్ , ప్రతి కేంద్రంలో శానిటైజర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్‌ వేసే సమయంలో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే… ఈ ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌ను పెట్టాలని తొలుత భావించినా దానికోసం చట్టసవరణ చేయాల్సి ఉన్న కారణంగా ఆ ప్రయత్నాన్ని మానుకున్నామని పార్థసారథి తెలిపారు. పైగా ఇందుకోసం సాప్ట్‌వేర్‌ అభివృద్ధి చేయడానికి కాలపరిమితి అనుకూలించడం లేదని, ఇది ఓటర్ల గోప్యతకు సంబంధించిన అంశం కాబట్టి హడావుడిగా చేయరాదనే అభిప్రాయానికి కమిషన్‌ వచ్చిందని తెలిపారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1+3 చొప్పున మొత్తం నలుగురు ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో 30 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో పెడ్తామన్నారు. మొత్తం 50వేల నుంచి 55వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.