రూ.10కే భోజనం.. రూ.10 వేలు సాయం!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను శివసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు పెద్ద పీట వేస్తూ.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పథకాలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. శివసేన అధికారంలోకి వస్తే రూపాయికే వైద్యం, రూ.10కే భోజనం, రూ.10 వేలు ఆర్ధిక సాయం చేస్తామంది. పేదలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు […]

రూ.10కే భోజనం.. రూ.10 వేలు సాయం!
Follow us

|

Updated on: Oct 14, 2019 | 12:35 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను శివసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు పెద్ద పీట వేస్తూ.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పథకాలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. శివసేన అధికారంలోకి వస్తే రూపాయికే వైద్యం, రూ.10కే భోజనం, రూ.10 వేలు ఆర్ధిక సాయం చేస్తామంది.

పేదలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు నిర్మించి రూ.10కే నాణ్యమైన భోజనం అందిస్తాం. అంతేకాక మెరుగైన వైద్య సదుపాయలు కల్పిస్తూ.. ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. 300 యూనిట్ల వరకు విద్యుత్‌పై 30 శాతం రాయితీ, మరాఠీలో 80 శాతంపైగా మార్కులు సాధించిన 10, 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక నగదు సాయం, రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ వంటివి శివసేన మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. అంతేకాక రైతులకు ఊరట కలిగిచేలా ఐదేళ్లపాటు ఎరువులు, పురుగు మందుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయబోమని హామీ ఇచ్చారు. అటు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం, ముంబైలో మడ అడవుల అభివృద్ధి వంటి హామీలను కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుందని చెప్పాలి. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ ఎన్నికలకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెల్లడవుతాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..