రోడ్లపై గుంతలు పూడ్చలేదని.. మేయర్ని ట్రక్కుకు కట్టి…

అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేస్తామని, గుంతలు పూడ్చుతామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మెక్సికోలో ఓ మేయర్ ను స్థానికులు ఒక ట్రక్కుకు కట్టేసి రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారు. జార్జ్ లూయిస్ ఎస్కాండన్ అనే ఈ మేయర్ ఆఫీసులోకి చొరబడినవారు.. ఆయనను బలవంతంగా బయటకు తీసుకు వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. వీరికి, ఆయనను రక్షించడానికి వఛ్చిన వారికి మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది గాయపడ్డారు. పోలీసులు సుమారు ముప్పయ్ మందిని […]

రోడ్లపై గుంతలు పూడ్చలేదని.. మేయర్ని ట్రక్కుకు కట్టి...
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2019 | 11:39 AM

అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేస్తామని, గుంతలు పూడ్చుతామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మెక్సికోలో ఓ మేయర్ ను స్థానికులు ఒక ట్రక్కుకు కట్టేసి రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారు. జార్జ్ లూయిస్ ఎస్కాండన్ అనే ఈ మేయర్ ఆఫీసులోకి చొరబడినవారు.. ఆయనను బలవంతంగా బయటకు తీసుకు వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. వీరికి, ఆయనను రక్షించడానికి వఛ్చిన వారికి మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది గాయపడ్డారు. పోలీసులు సుమారు ముప్పయ్ మందిని అరెస్టు చేశారు. ట్రక్కుకు మేయర్ ను కట్టి లాక్కుపోతున్న వీడియో వైరల్ అయింది. కాగా-ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసులు వఛ్చి ఆయనను రక్షించారు. ఈ దాడి తరువాత మాట్లాడిన ఎస్కాండన్.. తనపై హత్యా యత్నం జరిగిందని, ఈ ఘటనకు కారకులైనవారిపై కేసు పెడతానని చెప్పారు. దాదాపు నాలుగు నెలల క్రితం కూడా కొంతమంది ఆయన కార్యాలయంపై దాడి చేశారు. అయితే ఆయన కనబడకపోవడంతో కార్యాలయ అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. మెక్సికో లోని ‘ చియాపస్ ‘ అనే సిటీలో జరిగిందీ ఘటన !